USIndiaDosti: భారత్‌కు చేరిన అమెరికా సాయం

న్యూఢిల్లీ (CLiC2NEWS) : అమెరికా నుంచి బ‌య‌ల్దేరిన అత్య‌వ‌స‌ర స‌హాయం, ప‌రిక‌రాలు నేడు భార‌త్ చేరుకొన్నాయి. ఈ విష‌యాన్ని భార‌త్‌లోని అమెరికా దౌత్య కార్యాల‌యం ట్విట్ట‌ర్‌లో తెలిపింది. ఈ క్రమంలో శుక్రవారం అమెరికా నుంచి భారత్‌ తొలి కొవిడ్ అత్యవసర సహాయ సామగ్రిని అందుకున్నది. 400కి పైగా ఆక్సిజన్ సిలిండర్లు, దాదాపు ఒక మిలియన్ ర్యాపిడ్ కరోనావైరస్ టెస్ట్ కిట్లు, ఇతర పరికరాలతో, సూపర్ గెలాక్సీ మిలిటరీ ట్రాన్స్‌పోర్టర్‌ ఇవాళ ఉదయం ఢిల్లీ అంతర్జాతీయ విమానంలో దిగింది.

ఈ మేరకు యూఎస్‌ ఎంబసీ భారతదేశానికి తాము సహాయం చేస్తామని ఇచ్చిన మాట మేరకు సహాయం అందిస్తున్నామని, సహాయానికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేసింది.
‘కొవిడ్‌తో పారాడేందుకు అవ‌స‌ర‌మైన అత్య‌వ‌స‌ర ప‌రికరాలు, ఇత‌ర సాయంతో తొలివిడ‌త షిప్‌మెంట్ భారతదేశానికి చేరుకుంది. 70 సంవత్సరాల పరస్పర సహకారంతో, యునైటెడ్ స్టేట్స్ భారతదేశంతో నిలుస్తుంది. మేము సమిష్టిగా కొవిడ్-19 మహమ్మారితో పోరాడుతాం’ అంటూ ట్వీట్‌ చేసింది. #USIndiaDosti అంటూ యూఎస్‌ ఎంబసీ హ్యాష్‌ట్యాగ్‌ ఇచ్చింది.

10 ల‌క్ష‌ల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు
అమెరికా నుంచి వచ్చిన వాటిల్లో వెయ్యి ఆక్సిజన్‌ సిలిండర్లు, 1.50కోట్ల ఎన్‌-95 మాస్కులు, పది లక్షల ర్యాపిడ్‌ టెస్ట్ కిట్స్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తయారీకి సంబంధించి ముడి సరుకు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. యూఎస్ లోని వివిధ కంపెనీలు మరియు వ్యక్తులు విరాళంగా ఇచ్చే పరికరాలను కూడా తీసుకువచ్చే ప్రత్యేక విమానాలు వచ్చే వారంలో కూడా కొనసాగుతాయని అమెరికా అధికారులు తెలిపారు.

అలాగే బ్రిట‌ర్‌, రోమేనియా నుంచి కూడా నేడు భార‌త్‌కు కొవిడ్ సాయం అందింది. ఈ విష‌యాన్ని భార‌త విదేశాంగ శాఖ ప్ర‌తినిధి అరిందం బ‌గాచీ ద్రువీక‌రించారు.

Leave A Reply

Your email address will not be published.