Uttar Pradesh: రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉచితంగా వైద్యం

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ (CLiC2NEWS): ఎన్నిక‌లంటే రాజ‌కీయ పార్టీలు ప‌లు ర‌కాల హామీల‌తో ప్ర‌జ‌ల్ని త‌మ‌వైపు ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లి ఎన్నికలు మ‌రికొన్ని నెల‌లో జ‌ర‌గ‌నున్నవిష‌యం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ త‌మ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే మహిళలకు 40% టికెట్లు, రైతు రుణాల రద్దు, 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పన  విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్లు, ఈ-స్కూటర్లు తదితర ఏడు హామీలు ప్రకటించారు. తాజాగా యూపీ ప్రజలకు మరో కీలక హామీ ఇచ్చారు. ప్ర‌జ‌లంద‌రికీ రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల ఆరోగ్య ప‌రిస్థితి ఎంత దుర్భ‌రంగా ఉందో తెలుసుకు‌న్నామని, అందుకే నాణ్య‌మైన  వైద్యం అందించే అంశాన్ని త‌మ మేనిఫెస్ట్‌లో పెట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.