మధ్యప్రదేశ్‌లో 24 గంటల్లో 24.20 లక్షల మందికి వ్యాక్సిన్
భోపాల్ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ మహమ్మారికి వ్యాక్సినేషన్‌తోనే అడ్డుకట్ట వేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ప్రపంచమంతా కొవిడ్ వ్యాక్సినేషన్‌లో వేగం పెంచారు. ప్రతీ దేశం తమ పౌరులందరికి వ్యాక్సినేషన్ త్వరగా వేసే దిశగా ముందుకు సాగుతున్నారు. భారత్‌లో కూడా వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నారు. ప్రతిరోజూ దేశంలో 60 లక్షల మందికి పైగా టీకాలు తీసుకుంటున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కార్‌మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టింది. ఈ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా 24 గంటల వ్యవధిలో 24.20 లక్షల మందికి వ్యాక్సిన్‌ను అందించింది. దాదాపుగా గంటకు లక్ష మందికి వ్యాక్సిన్ అందించింది. 24 గంటల్లో 24.20 లక్షల మందికి టీకాలు అందించి వ్యాక్సినేషన్‌లో కొత్త రిరికార్డ్ నెలకొల్పింది.
ఇంతకు ముందు కూడా ఎంపి రాష్ట్ర సర్కార్ మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 17.62 లక్షల మందికి వ్యాక్సిన్‌ను అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డును మరోసారి మధ్యప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం బ్రేక్ చేసింది.