జనవరి 15కల్లా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవ్వాలి: ఆళ్ల నాని
అమరావతి(CLiCNEWS): వచ్చే జనవరి 15నాటికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవ్వాలని సిఎం ఆదేశించినట్లు ఎపి వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారికిఆర్ టి-పిసిఆర్ పరీక్ష తప్పనిసరి అని తెలిపారు. కొవిడ్‌పై సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మంత్రి వివరాలను మీడియాకు వివరించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో ప్రపంచవ్యాప్తంగా భయందోళనలు నెలకొన్నాయని అది రాష్ట్రానికి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించినట్లు చెప్పారు. కొత్త వెరింట్‌పై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని సిఎం చెప్పినట్లు మంత్రి వివరించారు. కొవిడ్ వ్యక్సినేషన్ వేవంతం చేయాలని సిఎం ఆదేశించారన్నారు. వచ్చే జనవరి 15నాటికిరాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవ్వాలని సిఎం ఆదేశించినట్లు వెల్లడించారు.