వ‌ర‌ద బాధితుల‌ను అన్ని విధాలా ఆదుకోవాలి: సిఎం జ‌గ‌న్‌

అమ‌రావ‌తి(CLiC2NEWS) : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జగ‌న్‌ వ‌ర‌ద బాధిత జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో  వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.
రాష్ట్రంలోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంత‌ల్లోని బాధితుల‌ను అన్ని విధాలా ఆదుకోవాల‌ని  సిఎం జ‌గ‌న్ క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని త‌క్ష‌ణం నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. . క‌డ‌ప‌, చిత్తూరు, నెల్లూరు, అనంత‌పురం జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఇత‌ర విభాగాల అధికారులు స‌మీక్ష‌లో పాల్గొన్నారు. తాగునీటి వ‌స‌తుల పున‌రుద్ద‌ర‌ణ‌పై దృష్టి పెట్టాల‌న్నారు. గండ్లు పూడ్చివేత‌, గ‌ల్లంతైన వారికి న‌ష్ట‌ప‌రిహారం, మ‌ర‌ణించిన ప‌శువుల‌కు ప‌రిహారం ప‌లు అంశాలు సిఎం స‌మీక్షించారు. నిత్యావ‌స‌రాల‌ను అందించిన ప్ర‌తి ఇంటికీ అద‌న‌పు సాయంగా రూ.2వేలు ఇవ్వాల‌ని అన్నారు. ఇళ్లు లేని వారికి తాత్యాలిక వ‌స‌తి ఏన్పాట్ల‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.