ఐపిఎల్ లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన వైభవ్..
Vaibhav scored the fastest century in IPL..

IPL: అతిపిన్న వయస్సులో వైభవ్ సూర్యవంశీ ఐపిఎల్‌లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 14 ఏళ్ల 32 రోజుల వైభవ్.. తాను ఆడిన మూడో మ్యాచ్‌లోనే పలు రికార్డులు సాధించాడు. సోమవారం రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ తో తలపడింది. ఈ పోరులో వైభవ్ అద్భత ఇన్నింగ్స్ ప్రదర్శించాడు. 35 బంతుల్లో శతకం బాది, అతి పిన్న వయస్సులో వేగంగా శతకం చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. క్రిసిగేల్ 2013లో 30 బంతుల్లో శతకం చేయగా.. వైభవ్ 35 బంతుల్లో శతకం సాధించి రెండో స్థానంలో ఉన్నాడు.
ఈ సందర్భంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ప్రాంచైజి యజమాని సంజీవ్ గొయెంకా వైభవ్ చిన్ననాటి ఫోటోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. వైభవ్ సూర్యవంశీకి 6 ఏళ్ళు ఉన్నపుడు, 2017లో అప్పటి జట్టు రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌ను ఉత్సాహ పరుస్తున్న ఫోటో అది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.