టిటిడిలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు..
తిరుపతి(CLiC2NEWS): తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తామని ప్రకటించింది. అన్నమయ్య భవనంలో ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుబ్బారెడ్డి వైవి మాట్లాడుతూ.. అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయాలని, ఈ మార్గంలో రోడ్డు, కాలినడక మార్గాలను నిర్మించాలని అన్నారు. భక్తులకు 10 రోజులపాటు వైకుంఠ దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కొవిడ్ మార్గదర్శకాలు సడలించే అవకాశం ఉంటే సంక్రాంతి నుండి దర్శనాల సంఖ్య పెంచుతామని, ఈ విషయానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయలని నిర్ణయించినట్లు వెల్లడించారు.