వాజ్‌పేయీ.. గొప్పరాజనీతిజ్ఞుడు: ప్రధాని మోడీ
ఢిల్లీ (CLiC2NEWS): ప్రపంచలోని పలు దేశాల్లో కారోనా కేసులు పెరుగుతున్నందున దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సూచించారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భంగా మోడీ మాట్లాడతూ.. వచ్చే సంవత్సరం జి-20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఎంతో గొప్పగా భావిస్తున్నానని అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ గొప్పరాజనీతిజ్ఞుడని కొనియాడారు. ఈ రోజు మన్‌కీబాత్‌లో ప్రసంగిస్తూ.. ఈ ఏడాదికి ఇది చివరిదని, రానున్న సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఇటీవల గోవాలో నిర్వహించిన ఆయుర్వేద కాంగ్రెస్ పాల్గొన్నానని, ఎవిడెన్స్ బేస్‌డ్ రిసెర్చ్ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు. కొవిడ్ వ్యాప్తిపై మోగా, ఆయుర్వేదం ఫలితాలను ప్రత్యక్షంగా చూశామన్నారు. వీటిని సాక్ష్యాధారాలతో నిరూపించే దిశగా పరిశోధనలు జరగాలని,, మోగా, ఆయుర్వేదం లాంటి సంప్రాదాయ చికిత్స మార్గాలు ఎవరికైనా తెలిస్తే తెలియజేయాలని ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు.