జ‌లమండ‌లి ఆధ్వ‌ర్యంలో వ‌న మ‌హోత్స‌వం

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): స్వతంత్ర భార‌త వ‌జ్రోత్స‌వాల్లో భాగంగా జ‌ల‌మండ‌లి ఆధ్వ‌ర్యంలో వ‌న మ‌హోత్స‌వం కార్య‌క్ర‌మం ఘ‌నంగా నిర్వ‌హించారు. బుధ‌వారం హిమాయ‌త్‌సాగ‌ర్‌లోని జ‌ల‌మండ‌లి ప్లాంటేష‌న్ సెల్ ఆవ‌ర‌ణ‌లో జ‌ల‌మండ‌లి ఈడీ డా.ఎం.స‌త్య‌నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో అధికారులు మొక్క‌లు నాటారు. భార‌త‌దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సంద‌ర్భంగా స్వ‌తంత్ర పోరాట స్ఫూర్తిని, స్వ‌తంత్ర పోరాట‌యోధుల త్యాగాల‌ను గుర్తుచేసుకునేలా రాష్ట్ర ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున స్వతంత్ర భార‌త వ‌జ్రోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్న విషయం తెలిసిన‌దే.

ఈ కార్య‌క్ర‌మంలో జ‌ల‌మండ‌లి ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ శ్రీధ‌ర్ బాబు, రెవెన్యూ డైరెక్ట‌ర్ వీఎల్ ప్ర‌వీణ్ కుమార్‌, టెక్నిక‌ల్ డైరెక్ట‌ర్ ర‌వికుమార్‌, ఫైనాన్స్ డైరెక్ట‌ర్ వాసుదేవ నాయుడు, ఆప‌రేష‌న్స్ డైరెక్ట‌ర్లు అజ్మీరా కృష్ణ‌, స్వామి, సీజీఎంలు, డీఎఫ్‌వో మోహ‌న్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.


Regards,

Leave A Reply

Your email address will not be published.