జాతీయగీతం, జాతీయ‌గేయం.. రెండింటికి స‌మాన హోదా :స్ప‌ష్టం చేసిన కేంద్రం

జ‌న‌గ‌ణ‌మ‌ణ‌, వందేమాత‌రంకు స‌మాన హోదా.. స్ప‌ష్టం చేసిన కేంద్రం

ఢిల్లీ (CLiC2NEWS): జ‌న‌గ‌ణ‌మ‌ణ‌, వందేమాత‌రంకు స‌మాన హోదా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ఫ‌ష్టం చేసింది. జాతీయ గీతం జ‌న‌గ‌ణ‌మ‌న కి స‌మాన‌మైన హోదాను జాతీయ గేయం వందేమాత‌రంకి కూడా క‌ల్పించాల‌ని కోరుతూ పిటిష‌న్ ఢిల్లీ హైకోర్టు దాఖ‌లైంది. దీనిపై తాజాగా కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌తి భార‌తీయ పౌరుడు ఈ రెండింటికి స‌మాన గౌర‌వం ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేసింది.

అన్ని విద్యాసంస్థ‌ల్లో ప్ర‌తిరోజూ వందేమాత‌రం, జ‌న‌గ‌ణ‌మ‌న పాడేలా త‌గిన ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని.. భార‌త స్వాతంత్య్ర పోర‌టంలో వందేమాత‌రం కీల‌క పాత్ర పోషించింద‌ని పిటిష‌న‌ర్‌, న్యాయ‌వాది అశ్విని ఉపాధ్యాయ తెలిపారు. ప్ర‌స్తుతం జాతీయ గీతం జ‌న‌గ‌ణ‌మ‌ణ‌తో పాటు జాతీయ గేయం వందేమాత‌రంకు స‌మాన‌మైన గౌర‌వం ఇవ్వాల‌ని .. ఈ రెండింటికి స‌మాన హోదా ల్పించేలా మార్గ‌ద‌ర్శకాల‌ను రూపొందించేలా త‌గిన ఆదేశాలు జారీ చేయాల‌ని ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది.

1 Comment
  1. yat kiralama says

    Hmm is anyone else experiencing problems with the pictures on this blog loading?
    I’m trying to figure out if its a problem on my end or if it’s the blog.
    Any feedback would be greatly appreciated.

Leave A Reply

Your email address will not be published.