అవనిగడ్డ నుండి ప్రారంభమైన వారాహి యాత్ర..
![](https://clic2news.com/wp-content/uploads/2023/10/pawan-kalyan-at-avanigadda.jpg)
అవనిగడ్డ (CLiC2NEWS): కృష్ణా జిల్లా అవనిగడ్డ నుండి జనసేనాని పవన్ కల్యాణ్ నాల్గవ విడత వారాహి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ ఆర్‌సిపి వచ్చే ఎన్నిల్లో ఓటమి ఖాయమని.. రాబోయే ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. జగన్ అద్భుతమైన పాలకుడైతే నాకు రోడ్డుమీదకు వచ్చే అవసరమేలేదని పవన్‌కాల్యాణ్ అన్నారు. డబ్బు, భూముల మీద తనకి ఆసక్తి లేదన్నారు. జగన్ రూ. వేల కోట్ల అవినీతి చేసినట్లు రుజువైందని.. అధికార మదం ఉన్న వైఎస్ ఆర్ సిపి నేతలను ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసన్నారు. ఈ పది సంవత్సరాలో జనసేన పార్టీ ఎన్నో దెబ్బలు తిందని.. ఆశయాలు, విఉలవల కోసం మేం పార్టీ నడుపుతున్నామన్నారు. యువత భవిష్యత్తు బాగుండాలని ఎప్పుడూ అనుకుంటామని.. మనకు పార్టీల కంటే రాష్ట్రం చాలా ముఖ్యమన్నారు. రాష్ట్ర యువత ఎంతో విలువైన దశాబ్ధ కాలం కోల్పోయారన్నారు.
కానిస్టేబుల్ అభ్యర్థుల నియామక ప్రక్రియలో అనే ఇబ్బందులు ఉన్నాయన్న ఆయన.. మొగా డిఎస్సి కోరుకుంటున్న అందరికీ అండగా ఉంటామన్నారు. 30వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. డిఎస్సి వేస్తామని జగన్ హామీ ఇచ్చారని.. ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. మేం వచ్చాక నిరుద్యోగుల రుణం తీర్చుకుంటామని జనసేనాని తెలిపారు.
రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అన్నారని.. ఆ కురుక్షేత్రంలో మేం పాండవులమని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.