వారణాసి వరుస బాంబు పేలుళ్ల సూత్రధారికి ఉరిశిక్ష
లఖ్‌నవూ (CLiC2NEWS): 2006 నాటి వారణాసి బాంబు పేలుళ్ల సూత్రధారి, ఉగ్రవాది వలీఉల్లా ఖాన్‌కు కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గజియాబాద్ సెషన్స్ కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. 16 ఏళ్ల క్రితం జరిగిన వారణాసి బాంబు పేలుల్లకు సంబంధించిన రెండు కేసుల్లో వలీఉల్లా ఖాన్‌ను కోర్టు దోషిగా తేల్చింది. ఈ నేపథ్యంలోనే సోమవారం తీర్పును ఖరారు చేసింది. 2006 మార్చి 7న వారణాసిలోని సంకట్ మోచన్ ఆలయం వద్ద మొదట బాంబు పేలుళ్లు సంభవించాయి. 15 నిమిషాల అనంతరం కంటోన్మెంట్ రైల్యే స్టేషన్లో మరోబాంబు దాడి జరిగింది. ఈ రెండు ఘటనలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 100 మందికి పైగా గాయపడ్డారు.
హత్య, హత్యాయత్నం, తీవ్రంగా గాయపరచడం, ఆయుధాలను అక్రమంగా వినియోగించడం తదితర నేరారోపణలతో వలీఉల్లా ఖాన్‌పై పోలీసులు అభియోగాలను మోపార. ఈ మేరకు రెండు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో పోలీసులు సరైన సాక్ష్యాధారాలు సమర్పించడంతో గజియాబాద్ కోర్టు న్యాయమూర్తి జితేంద్ర కుమార్ సిన్హా తీర్పును వెలువరించారు.