వైఎస్ఆర్‌సిపికి వాసిరెడ్డి పద్మ రాజీనామా

గుంటూరు (CLiC2NEWS): వైఎస్ ఆర్ పార్టి మహిళా నేత, రాష్ట్ర మహిళా కమిషన్ మాజి ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైఎస్ ఆర్‌సిపి కార్యాలయానికి పంపారు. గత కొంతకాలంగా పార్టి కార్యాక్రమాలకు పద్మా దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె పార్టీని వీడారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మద్యం పేరిట పేద ప్జలను దోచుకున్నారని, మహిళపై జరుగుతున్నఅఘాయిత్యాలు, దాడులను జగన్ దృష్టికి తీసుకెళ్లినా కనీస చర్లయు తీసుకోలేదని ఆరోపించారు. పార్టిలో మహిళలకు ఎలాంటి ప్రధాన్యత లేదని.. ఎన్నో అవమానాలు ఎదురైనా క్రమశిక్షణ కలిగిన నేతగా పార్టి కోసం పనిచేశానన్నారు.