అమరావతిలో ఘనంగా వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ , న్యాయమూర్తులు , మంత్రులు, టిటిడి బోర్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అమరావతిలోని వెంకటపాలెంలో తిరుమల ఆలయ నమూనా గోపురాలతో విశాలమైన వేదిక ఏర్పాటు చేశారు. రాజధాని పరిధిఇలోని 24 గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఆహ్వాన పత్రికను పంపి .. కల్యాణ మహోత్సవానికి ఆహ్వానించారు. కల్యాణానికి వచ్చే భక్తుల కోసం 300 బస్సులు కూడా ఏర్పాటు చేశారు. సిఎం దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.