లోటు బ‌బ్జెట్‌.. కామ‌న్‌వెల్త్ గేమ్స్ నిర్వ‌హించ‌లేమంటున్న విక్టోరియా

మెల్‌బోర్న్‌ (CLiC2NEWS): నాలుగేళ్లకోసారి నిర్వ‌హించే కామ‌న్ వెల్త్ గేమ్స్‌కు 2026లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ వేదిక‌కానుంది. కానీ.. ఈ సారి తాము ఈ గేమ్స్ నిర్వ‌హించ‌లేమ‌ని విక్టోరియా స్టేట్ తెల్పిన‌ట్లు స‌మాచారం. ముందు అనుకున్న దానికంటే ఎక్కువ బ‌డ్జెట్ అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని.. ఇప్పుడున్న ప‌రిస్థితుల‌లో అంత బ‌డ్జెట్ త‌మ వల్ల కాద‌ని స్ఫ‌ష్టం చేసింది. ఈ గేమ్స్ నిర్వ‌హ‌ణ‌కు త‌మ బ‌డ్జెట్‌లో రెండు ఆస్ట్రేలియ‌న్ బిలియ‌న్ డాల‌ర్లు కేటాయించ‌గా.. ఇపుడు ఆ ఖ‌ర్యు ఏడు అస్ట్రేలియ‌న్ బిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు అయ్యేలా ఉంద‌ని వెల్ల‌డించింది. లోటు బ‌బ్జెట్‌లో ఉన్న త‌మ‌కు ఈ బ‌డ్జెట్‌తో కామ‌న్‌వెల్త్ గేమ్స్ నిర్వ‌హించ‌డం సాధ్యం కాద‌నిపిస్తోంద‌ని తెలిపింది. దీనికి సంబంధించి కామ‌న్ వెల్త్ గేమ్స్ అథారిటీకి స‌మాచార‌మిచ్చిన‌ట్లు తెలుస్తోంది. త‌మ కాంట్రాక్ట్‌ను ర‌ద్దు చేసి వేరే వారికి అవ‌కాశం ఇవ్వ‌మ‌ని కోరిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.