న్యూయార్క్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక
న్యూయార్క్ (CLiC2NEWS): న్యూయార్క్ నగరంలో టాలీవుడ్ హీరో విజయ దేవరకొండ, హీరోయిన్ రష్మిక సందడి చేశారు. భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవపు వేడుకల్లో భాగాంగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ .. ఇండియా డే పరేడ్ నిర్వహించింది. ఈ పరేడ్‌లో విజయ్‌దేవర కొండ, రష్మిక పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్, రష్మిక రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొన్నాళ్లుగా రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిరువురు కలిసి ఉన్న వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. ఈ పరేడ్‌లో మహిళలు డ్రమ్స్ వాయిస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు.
భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా న్యూయార్క్‌లో జరిగిన ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ లో టాలీవుడ్ హీరో, హీరోయిన్ రష్మిక, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ‘గీత గోవిందం’తో హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రంలో వీరిద్దరూ నటిస్తున్నట్లు సమాచారం.
Also Read: కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి.. విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు మృతి

[…] […]