ఒకే దేశం-ఒకే ఎన్నిక .. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది: విజయ్
చెన్నై (CLiC2NEWS): ప్రముఖ సినినటుడు, తమిళగ వెట్రి కళగం (టివికె) పార్టి వ్యవస్థాపకుడు విజయ్ పార్టి జిల్లా ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులతో ఆదివారం తొలిసారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశమంతా ఒకేసారి ఎన్నికల నిర్వహించేలా కేంద్రప్రభుత్వం చేపట్టిన జమిలి ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించారు. ఒకే దేశం- ఒకే ఎన్నికను అమలు చేసే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఈ చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన తన పార్టిని సంస్తాగతంగా బలోపేతం చేయడం, ప్రజలకు చేరువయ్యే అంశాలపై ప్రధానంగా చర్చించి 26 తీర్మానాలు ఆమోదించారు.
ఈ సందర్బంగా రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న పాలనపై విజయ్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో కులగణన చేపట్టాలని, పరందూర్ విమానాశ్రయం ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఆయన క్రమంగా మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా జాయింట్ పార్లమెంటరీ కమిటి (జెపిసి) రివ్యూలో ఉన్న వక్ఫ్ సవరణ బిల్లు -2024 ను ఫెడరలిజంపై దాడిగా పేర్కొన్న విజయ్.. బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ ను రద్దుకు మద్దతుగా నిలిచి.. విద్యను ఉమ్మడి జాబితా నుండి రాష్ట్ర జాబితాఉక మార్చాలని కోరారు.