ఎంపి విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం
అమరావతి (CLiC2NEWS): వైఎస్ ఆర్‌సిపి రాజ్య సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక ప్రకట చేశారు. ఆయన రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వానికి జనవరి 25 న రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం మరో మూడేళ్లు.. అనగా 2028 జూన్ వరకు ఉంది. ఆయన రాజీనామా చేయడంపై పార్టీలో చర్చనీయాంశమైంది.
వేరే పదవులు, ప్రయోజనాలు ఆశించి రాజీనామా చేయడంలేదని.. మరి ఏ ఇతర రాజకీయ పార్టీలలో చేరనన్నారు. రాజీనామా వ్యక్తికగ నిర్ణయమని, ఎలాంటి వత్తిళ్లు లేవన్నారు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు ప్రోత్సహించి కొండంత బలాన్ని , మనో ధైర్యాన్ని ఇచ్చి.. తెలుగు రాష్ట్రాలలో నాకు గుర్తింపు నిచ్చిన ప్రధాని మోడీ , కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలు, మిత్రులు, సహచరులు, పార్టి కార్యకర్తకలు పేరుపేరునా కృతజ్ఞతలు అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతికి సదా కృతజ్ఞుడిని అని.. జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నానని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.