విజయవాడ కనదుర్గ అమ్మవారికి రూ.18లక్షల విలువలగల మంగళసూత్రం..

విజయవాడ (CLiC2NEWS): ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మకు భక్తులు భారీ ఎత్తున కానుకలు సమర్పించారు. అమ్మవారికి వెండి హంసవాహనం, బంగారు మంగళసూత్రం బహుకరించారు. ప్రకాశం జిల్లా కొండేపి వాసి కల్లగుంట అంకులయ్య అనే భక్తుడు రూ. 18 లక్షల విలువ గల బంగారు మంగళసూత్రాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించారు. గుంటూరుకు చెందిన చేబ్రోలు పుల్లయ్య అనే భక్తుడు 6.5 కేజీల వెండితో చేసి హంసవాహనాన్ని అమ్మవారికి అందించారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం కనకదుర్గ అమ్మవారు .. అన్నపూర్ణా దేవి అవతారంలో భక్త్తులకు దర్శనమిచ్చారు.