కాలేజి బ‌స్సు న‌డుపుతున్న డ్రైవ‌ర్‌కు గుండెపోటు

స‌మ‌యానికి సిపిఆర్ చేసిన విజ‌య‌వాడ పోలీసులు

విజ‌య‌వాడ‌ (CLiC2NEWS): కాలేజీ బ‌స్సు న‌డుపుతున్న డ్రైవ‌ర్‌కు గుండెపోటు రావ‌డంతో పోలీసులు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఘ‌ట‌న విజ‌య‌వాడ‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విజ‌య‌వాడ‌లోని ఓ క‌ళాశాల‌కు చెందిన దాదాపు 30 మంది విద్యార్థుల‌తో గ‌న్న‌వ‌రం నుంచి గుణ‌ద‌ల‌కు వెళ్లున్న బ‌స్సు వెళ్లోంది. బ‌స్సు రామ‌వ‌ర‌ప్పాడు రింగ్ రోడ్డు వ‌ద్ద‌కు రాగానే ఉన్నంటుండి బ‌స్సు డ్రైవ‌ర్ వీరాస్వామికి గుండెపోటు వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో బ‌స్సు ఓ బైక్‌ను డీకొనాగిపోయింది. ఆ స‌మ‌యంలో వెంట‌నే డ్రైవ‌ర్ అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లాడు. ఆస‌మ‌యంలో అక్క‌డ విధులు నిర్వ‌హిస్తున్న ట్రాఫిక్ పోలీసులు సిఐ ర‌మేష్ కుమార్, ఎస్సై రాజేశ్ లు డ్రైవ‌ర్ వీరాస్వామికి సిపిఆర్ చేసి వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. స‌కాలంలో ఆసుప‌త్రికి చేరుకోవ‌డంతో డ్రైవ‌ర్‌కు ప్రాణాపాయం త‌ప్పింది.
ఈ ఘ‌ట‌న‌లో బ‌స్సు ఢీ కొన్న ద్విచ‌క్ర‌వాన‌దారుడికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి.

Also Read : త‌మిళ స‌ర్కార్‌కు సుప్రీంలో చుక్కెదురు

Leave A Reply

Your email address will not be published.