విజయుడు (ధారావాహిక నవల)
-కోనేటి రంగయ్య
ఢిల్లీ నుంచి కారు ఆగ్రాపైపు వేగంగా వెళ్తోంది..కారులో కూర్చున్న విజయ్ ఫోన్ రింగ్ అవుతున్నది.
నారాయణ…
వేగంగా కారును నడుపుతున్న డ్రైవర్ నారాయణ కారును స్లో చేస్తూ ఏమిటన్నట్లుగా వెనుకకు తల తిప్పాడు కొద్ది సేపు కారును ఆపు..ఫోన్ మాట్లాడాలి.
అలాగే సార్ అంటూ డ్రైవర్ నారాయణ చెట్టు వద్ద నీడన కారును ఆపాడు. రింగ్ అవుతున్న సెల్‌ఫోన్ ను ఆన్ చేసిన విజయ్‌కు అవతలి నుంచి..
ఎంఎల్ఎ గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారంటూ ఫోన్‌ను కనెక్టు చేస్తున్నానని చెప్పారు ఆపరేటర్..
నమస్తే సార్ ఉదయమే గుర్తు చేసుకున్నాను మిమ్ముల్ని. పత్రికలు చూడగానే మీకు ఫోన్ చేద్దామనుకున్నా.. కాని ఇంత ఉదయమే మీరు బిజీగా ఉంటారని భావించాను సార్.
సరే హైదరాబాద్‌కు ఎప్పుడు వస్తున్నావు.
మీకు చెప్పి వచ్చాను కదా సార్, రెండు రోజుల్లో మీ వద్ద ఉంటా..
కాదయ్యా, నీవు రోజు ఉదయం కలిసి అన్ని విషయాలు వివరించే వాడివి. నాకు పోలీస్ ఇంటలిజెన్ అధికారులిచ్చే రిపోర్టుల కంటే నీ నుంచి వచ్చే సమాచారం మీదనే నేను అధికంగా ఆధారపపడుతానని నీకు తెలుసుకదా. అందుకే మూడు రోజులుగా నీ నుంచి కాల్స్ కూడా రాకపోవడంతో నేనే ప్రయత్నించా.. నీ ట్రిప్ కాన్సిల్ చేసుకొని రాత్రికి వచ్చేయి.
సార్.. మీతో పర్మిషన్ తీసుకొని వచ్చాను కదా.. ఇంకా ఢిల్లీలోని కీలక ప్రాంతాలనే చూడలేదు. పార్లమెంట్ సమావేశాలు జరుతున్నాయి.. నిన్ననే పార్లమెంట్ భవన్‌కు వెళ్లి ప్రొసీడింగ్స్ పరిశీలించా.. ఇవి కూడా మన అసెంబ్లీ కంటే అంత మెరుగ్గా ఏమీలేవు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న తాజ్‌మహల్ చూడాలని ఉదయమే బయలు దేరాను సార్.. సాయంత్రానికి తిరిగి వచ్చి విమానం టికెట్టు ను ప్రీఫోన్ చేసుకొని రావడానికి ప్రయత్నిస్తా..
నేను ఢిల్లీలోని మన భవన్ ఉన్నతాధికారులకు చెబుతా.. నీ టికెట్ విషయం వారు చూసుకుంటారు విజయ్.
లేదు సార్ విమానం సాయత్రం బయలుదేరే వరకు నేనే చేరుకుంటానో లేదో సమయం కుదిరితే రాత్రికి వస్తాను లేదంటే వీలైనంత తొందరగా వస్తాను.
సరే ఏదైనా నీవు వీలైనంత త్వరంగా రావాలి. మరోసారి నేను ఢిల్లీకి బయలు దేరే సమయంలో నిన్ను తీసుకు వస్తాను. మిగిలిన ప్రాంతాలు అప్పుడు సావధానంగా చూద్దువు కానీ..
సరే సార్ మీరంతగా చెప్పాలా..
ఆ ఆహా వచ్చేయి.
అలాగే సార్ ఉంటాను.. అంటూ విజయ్ ఫోన్ పెట్టేశారు.
నారాయణ కారును పోనివ్వు, అనగానే డ్రైవర్ తిరిగి కారును స్టార్టు చేశారు. అయితే ఇదే కారును ఢిల్లీలో వారు బయలు దేరినప్పటి నుంచి మరో లారీ వెంబడిస్తున్న విషయం వారు గమనించలేదు. చెట్టు కింద కారు నిలిచిపోయిన వెంటనే లారీ కూడా కొంత దూరం ముందుకువెళ్లి రోడ్డు పక్కన ఆగిపోయింది. ఈ విషయం డ్రైవర్ కు కానీ తెలంగాణ శాసనసభ్యుడు విజయ్‌కు కానీ తెలియదు. కారు కొద్దిగా ముందుకు వెళ్లగానే రోడ్డు పక్కను ఉన్న హోటల్ వద్ద ఆగి టీ తాగారు. హోటల్ వారికి బిల్లు చెల్లించేందుకు జేబులో చేయి పెట్టుకున్న విజయ్ ఒక్కసారిగా ఆశ్చర్య పోయాడు. డబ్బుతోపాటు తన అన్ని గుర్తింపు కార్డులు, బ్యాంక్ క్రెడిట్ కార్డులున్న పర్స్ కనపించక పోవడమే విజయ్ను నివ్వర పర్చింది. అయితే షర్టు జేబులో ఉన్న కొద్దిపాటి డబ్బు రానుపోను ఖర్చులకు సరిపోతుందిలే అని విజయ్ లెక్కపెట్టుకున్నారు. బిల్లు చెల్లించి ముందుకు కదిలారు. కారును వెంబడిస్తూ వచ్చిన లారీ అదే రోడ్డులో కొంత దూరంలో నిలిపి ఉండటం వారి కంటపడింది.
(సశేషం)