విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-17)

అయ్యో నేనే నిన్న మీ సిఎంగారిని అడిగాను. మన విజయ్ కనిపించక చానా రోజులైందని. అప్పుడే చెప్పానా నీవు ఎక్కడికి పోకుండా బంగ్లాలోనే ఉండాలని. నీవు వినిపించుకోకుండా క్వార్టర్‌లోనే ఉంటున్నావు. మాకు ఎవరున్నారయ్యా. ఇది నీ ఇళ్లు ఎప్పుడైనా రావచ్చు. ప్రత్యేకంగా అడిగి రావాలా ఏమి అంటూ ఆమె మొత్తగా కోపగించుకుంది.

అదికాదమ్మా.. ముఖ్యమంత్రి బంగ్లాలోనే నేను ఉంటే ఇతర ఎంఎల్‌ఎలు ఈర్ష్యపడుతారమ్మా. విజయ్‌ను సిఎం నెత్తిన ఎత్తుకుంటున్నాడంటూ ఏదోదో మాట్లాడుతారు. అది నాకిష్టం లేదు. అందుకే మీరు ఒత్తిడి చేసినా బంగ్లాలో ఉండలేకపోయాను. నా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత సిఎం గారు మీరు నాకు పెద్దదిక్కు అయ్యారు కదా. నాకు ఎవరున్నారు. మీరే నా శ్రేయోభిలాషులు. మీ దగ్గర ఉన్న చనువుతోనే కదమ్మా ఫోన్ చేసి భోజనానికి వస్తున్నా,అని విజయ్ చెప్పడంతో ఆమె ఆనందించింది. మీ సిఎంకు నేను చెబుతాలే రేపు తొందరగా వచ్చేయి అని అన్నపూర్ణమ్మ ఫోన్ కట్ చేసింది.

ముఖ్యమంత్రి సతీమణితో అంత చనువుగా మాట్లాడుతున్న విజయ్‌ను కుటుంబరావు, విరంచి కూడా ఆసక్తిగా చూశారు. మీకు అభ్యంతరం లేకపోతే ఈ పేపర్‌ను నేను తీసుకు వెళ్తానని విజయ్ కుటుంబరావుతో అన్నారు. నిరభ్యంతరంగా తీసుకు వెళ్లు కానీ ఈ పరిస్థితుల్లో మీరు మరింత జాగ్రత్తగా ఉంటే మంచిదేమో.

అని ,కొద్దిసేపు ఆగి విజయ్ గారు ప్రభుత్వం ప్రతి ఎంఎల్‌ఎకు గన్‌మెన్,ఎస్కార్టు వాహనం ఇచ్చినట్లు మీడియాలో వచ్చింది. మీకు ఎందుకు లేదని కుటుంబరావు ప్రశ్నించారు.

ఆ బాదరాబందీ ఎందుకని నేనే తీసుకోలేదు. ఎంఎల్‌ఎలు అంటే ప్రజాప్రతినిధులు మాకు రక్షణ ఏమిటో నాకు అర్థం కావడం లేదు.ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిషలు పనిచేసే వారికి ఇలాంటివి ఎందుకు చెప్పండి. నక్సల్స్ పేరుతో ఇతరత్రా ముప్పుఉందని పోలీసులు ఏవేవో రిపోర్టులిస్తారు. వాటి ఆధారంగా ఎందుకైనా మంచిదని అందరికీ రక్షణ పేరతో పోలీసులను కేటాయిస్తుంటారు. పోలీసు స్టేషన్లలో సిబ్బంది కరువని ఒకవపైపు చెబుతూ వారిని మా కోసం కేటాయించడం సబబుగా లేదు కదా. మా ఎంఎల్‌ఎలు ఇదే మేలు అన్నట్లుగా దర్జాలకు పోతూ రాజు వెడలే అన్నట్లు ప్రజల్లోకి వెలుతూ తాము చాలా గొప్పవారమని ఫీలవుతుంటారు. తీవ్రవాదులు కూడా మంచి పనులు చేసే వారికి కీడు ఎందుకు తలపెడతారండీ. నాకు గన్‌మెన్‌లుంటే వారికి భోజనవసతి కల్పించాలంటే నేనే బ్రహ్మచారిని ఎక్కడ ఉంటే అక్కడి సమీపంలో హోటల్ లో తింటాను. ఇలా మీ ఇంటికి వచ్చాను. డ్రైవర్, గన్‌మెన్ ఇలా అందరికీ మీరు భోజనం పెట్టాలంటే ఎలా ఉంటుంది. అందుకే నేను రక్షణ వద్దని రాఖండిగా చెప్పి తప్పించుకున్నానని విజయ్ వారికి కారణం చెప్పాడు.

అంతా విన్న తర్వాత కూడా విరంచి, లేదండి మీరు కూడా గన్‌మెన్‌లను తీసుకుంటేనే మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడైనా డిజిపికి చెప్పండి వెంటనే పంపిస్తారు కదా అంది.

మీరు నాగురించి ఇంతగా చెబుతున్నందుకు థాక్స్. ప్రస్తుతానికి అవసరం లేదనిపిస్తుంది.

మీరు ఢిల్లీకి వెళ్లింది నిజమేనా..అయితే ఇదంతా మీ గురించే.. మంత్రులకు మీపై ఎంత ఆగ్రహం ఉందో తెలుస్తున్నది. పరిస్థితిని మీరే సమీక్షించుకోండి అని విరంచి సూచించింది.

పత్రికల్లో వచ్చిన కథనాలన్నీ వాస్తవం కాకపోవచ్చు. నేను రేపు ముఖ్యమంత్రిని కలుస్తున్నాను కదా ఆయనతోనే మాట్లాడుతాను. నిర్ధారణ అవుతుంది, ఆయన నాకు నిజాలు చెబుతారనే ఆశిద్దాం. ఢిల్లీకి వెళ్లిన విషయం సిఎంకు తెలిసిందే. రహస్యం ఎదీ లేదు కూడా… అక్కడ మా జాతీయ నేతలను ఎవరిని కలువలేదు కూడా.

మీరు ఢిల్లీకి ఎప్పుడు వెళ్లారు. ఎప్పుడు వచ్చారు. ముఖ్యమంత్రితో మీరు దాదాపుగా రోజూ మాట్లాడుతానని అంటున్నారు కదా ఇంతవరకు ఆయన నీ గురించి వాకబ్ ఎందుకు చేయలేదు. అంత అభిమానం ఉంటే ఎప్పటికప్పుడు మీ యోగక్షేమ సమాచారాలు తెలుసుకోవాలి కదా. ఢిల్లీ పర్యటన తేదీలు ఒకసారి బేరీజు వేసుకోండి అని మరో సలహా ఇచ్చింది విరంచి.

విజయ్ గారికి అన్ని తెలుసు, ఎందుకు అలా చెబుతావు. సిఎంతో మాట్లాడుతాడు కదా సమస్యలు ఏవైనా ఉంటే వారిద్దరే తేల్చుకుంటారు. నీవు అనవసరంగా హైరానా పడుతున్నావని తండ్రి కలుగజేసుకోవడంతో విరంచి మౌనం దాల్చింది. తన పట్ల విరంచి చూపుతున్న శ్రద్దకు విజయ్ మనస్సులో ఆనంధం కలిగింది. ఇదేమి కనిపించకుండా…

ఏదైనా జరిగితే చూద్దాం అంటూ తేలికగా తీసివేశారు. అయితే మనుసులో ఢిల్లీలో జరిగిన దాడి గుర్తుకు వచ్చినా దానిని వారి ముందు తేవడం ఇష్టం లేక, ఇక వస్తాను అంటూ బయలు దేరాడు.

విజయ్ వెళ్లిన తర్వాత కూతురుతో మాట్లాడుతూ , విజయ్‌కు శత్రువులు పెరుగుతున్నట్లుగా ఆ వార్తా కథనం వెల్లడిస్తున్నది కదా అయినా తన భద్రత గురించి విజయ్ ఎందుకు ఆలోచించడం లేదో నాకు అర్థం కావడం లేదని కుటుంబరావు అన్నారు.

అవును డాడీ విజయ్ కొంత మొండిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం అంటే మంత్రులు, సిఎం కదా వారందరినీ ఢీ కొనేలా ఆయన వ్యవహరిస్తున్నారనే ఆందోళనతో మంత్రులు చెబుతున్నారంటే వారు చూస్తూ ఊరుకుంటారా? ఎన్ని సినిమాలలో చూడటం లేదు. గుండాలు, రౌఢీలు ఎదిగితేనే వారు రాజకీయ నేతలుగా మంత్రులుగా ప్రమోషన్లు పొందుతున్నారో.. వీరిలో కూడా అలాంటి వారే ఉండి ఉంటే విజయ్‌పై దాడి చేసేందుకు తన మాజీ అనుచరులను పురమాయిస్తే ఏమి జరుగుతుంది. ఆయన వెళ్లే కారును ఏ లారీతో ఢీ కొట్టిస్తే ఇక అంతే. విజయ్‌కు వ్యక్తిగతంగా వచ్చే లాభం ఏమిటో తెలియడం లేదు కానీ మంత్రులందరితో శత్రుత్వం పెంచుకుంటున్నారు… ఏమంటారు డాడీ

మనం ఏమి చేయగలం తల్లీ… ఇతరుల వలె ఆయన ఉండలేరు. తనకు తెలిసిన లోటుపాట్లను ఎలా సరిదిద్దగలనో ఆలోచిస్తాడు. అందుకే మీడియాకు చెబుతాడు. ముందు ముఖ్యమంత్రితో చర్చిస్తాడట. విజయ్ నిబద్దత కలిగిన రాజకీయ నాయకుడు. అవినీతి ఆయన దరిచేరదు. స్వశక్తితో ఎదిగిన నేత. అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. వీలైతే మనం ప్రోత్సహించాలే కానీ, నిరుత్సాహకర మాటలు కూడా చెప్పవద్దు విరంచి. అని కుటుంబరావు కూతురును అనునయించారు.

క్యార్టర్ కు వెళ్లకుండా విజయ్ సచివాలయంకు వెళ్లాడు. ముందుగా రిలీఫ్ కమిషనర్ నందా ఛాంబర్ వద్దకు వెళ్లి తాను వచ్చినట్లుగా చెప్పాలని నందా పిఎస్‌కు తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు. మీరు ఎప్పుడు వచ్చినా వెంనే లోనికి పంపాలని మాకు సార్ చెప్పాడు…వెళ్లండి అంటూ ఆఫీసర్ వద్దకు తానే తోడ్కొని వచ్చాడు.

గుడ్ ఈవినింగ్ సార్ బాగున్నారా అంటూ విజయ్, నందాతో షేక్‌ెండ్ చేసి ఎదురుగా కూర్చున్నారు.

సచివాలయానికి రావడం లేదు ఏమిటి కారణం, గత నెల వరకు ప్రతి రెండు రోజులకోసారి
కనిపించే వారంటూ నందా కుశల ప్రశ్నలు వేశారు.

ఇటీవల ఢిల్లీకి వెళ్లాను సరదాగా. పార్లమెంట్ కార్యకలాపాలు స్వయంగా చూడాలనిపించింది. అలాగే దేశ రాజధానిలో, చుట్టుపక్కల ఉన్న దర్శనీయ స్థలాలను ఆగ్రాలోని తాజ్‌మహల్‌తో సహా అన్ని చూడాలని వెళ్లాను కానీ ముఖ్యమంత్రిగారు త్వరగా రమ్మని అంటే ముందే రావడానికి ప్రయత్నించాను.

వరద నష్టం సమీక్షలలో ఎంతో బుజీగా ఉన్న సిఎం గారు మీకు ఫోన్ చేసి అర్జంట్‌గా రమ్మన్నారంటే మీరంటే ఎంత అభిమానం విజయ్ గారు అని నందా అన్నారు. అయితే తాను ఆగ్రాకు వెళ్తున్న సమయంలో సిఎం గారు మాట్లాడింది నిజమే కానీ ఆ రోజు భారీ వర్షాలు వచ్చాయి, వరదలతో నష్టం జరిగినట్లు ప్రస్తావించలేదే. విరంచి చెప్పినట్లు నేను ఢిల్లీకి ఏ తేదీన వెళ్లాను. ఎక్కడెక్కడకు వెళ్లి ఏమేమి ఎప్పుడు చూశాను తేదీ, సమయంతో సహా ఆయన మదిలోకి వచ్చింది. ఆగ్రాకు వెళ్లిన తేదీ నేను తిరిగి ఢిల్లీలోని ప్రభుత్వ భవన్‌కు చేరిన తేదీ మధ్య ఎక్కడ ఉన్నాను.నాలుగైదు రోజులు ఎక్కడ ఉన్నట్లు? ఏమీ అంతుబట్టడం లేదు.ప్రమాదం జరిగింది గుర్తుకు ఉంది కానీ తర్వాత భవన్‌కు చేరడం.. ఈ మధ్య ఏమి జరిగింది???ఊహూ…ఏమీ తెలియడం లేదు.. ఎంతో టెన్షన్‌కు గురయ్యాడు.

విజయ్… ఏమిటి ఆలోచిస్తున్నావు. అంటూ నందా ప్రశ్నించడంతో విజయ్ ఏమీలేదు ఏమీలేదు అంటూ తన నుదిటికి పట్టిన చమటలు తూడ్చుకున్నాడు.

విజయ్ ఆర్ యూ ఆల్‌రైట్.. ఎసి రూంలో ఉక్కపోస్తున్నదేమిటి? ఇంకా ఎసి పెంచాలా? అని మరోసారి నందా ఆయన ముఖం చూస్తున్నాడు.

ఏమీ లేదు సార్. కొంత నీరసంగా ఉన్నట్లుగా ఉంది. కాఫీ తాగుదామా అనడంతో బెల్‌కొట్టి బాయితో కాఫీ తెమ్మని నందా ఆదేశించారు.

వరదల పరిస్థితి, కేంద్ర బృందం పర్యటన వివరాలు, సహాయం ఎప్పటికి వస్తుందో, ప్రభుత్వ సహాయ చర్యలు ఎలా జరుగుతున్నదో తదితర విషయాలు వారి మధ్య చర్చకు వచ్చింది. సీనియర్ ఐఎఎస్ అధికారి కావడంతో ఇతర శాఖల సెక్రటరీలు కూడా నందా దగ్గరు వచ్చి సలహాలు తీసుకుంటారు. వారి శాఖలో మంత్రుల పెత్తనం, సెక్రటేరియట్ మ్యాన్‌వల్‌కు విరుద్ధంగా తాను లబ్దిపొందిన వారి కోసం ఫైళ్లపై ఇష్టానుసారం రాసి మంజూరీ చేయడం వంటి అవినీతి కార్యకలాపాలు కూడా నందా వద్ద వారు చర్చిస్తుంటారు. మంత్రి నోట్‌ఫైల్‌లో లోటుపాట్లు ఉంటే ప్రధాన కార్యదర్శి(సిఎస్)కు ఫైల్‌ను పంపే అవకాశం ప్రతిశాఖ సెక్రటరీకి ఉంటుంది.కానీ మంత్రితో వివాదం ఎందుకని ఆయన నోట్‌ఫైల్ మేరేక జిఒ లు జారీ చేస్తుంటారు. అయితే ఈ విషయంలో కొందరు సెక్రటరీలు కుమ్ముక్కు అయి వారు జేబులు నింపుకుంటున్న సందర్భాలు అధికంగానే ఉంటాయి. అందుకే అంతా గుట్టుగా సాగుతుంది. ఈ అవినీతి బాగోతం నందాకు తెలిస్తే ఫైల్స్ తో సహా విజయ్‌కు అందిస్తూ సహకరిస్తారు నందా. అందుకే వాస్తవ సమచారంతోనే విజయ్ అసెంబ్లీలో మాట్లాడగలుగుతుంటారు. మీడియాకు ఈ వివరాలిస్తూ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను బయటపెడుతురటాడు. నందా లాంటి నలుగురు ఆఫీసర్లను మాత్రమే విజయ్ తరుచుగా సచివాలయంలో సంప్రదిస్తుంటారు. అయితే సెక్రటేరియట్‌లో కొంత నిఘా ఉంటుందని భావిస్తే ఫోన్‌లో లేదా ఇతరచోట్ల కలిసి మాట్లాడుకుంటారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఆదాయ, వ్యయం ఎలా ఉందో తెలుసుకోవాలని నందా నుంచి సెలవు తీసుకొని మరో బ్లాక్‌లో ఉన్న ఫైనాన్స్ ముఖ్య కార్యదర్శిని కలిసాడు విజయ్. పన్నుల వసూళ్లు మందగించాయని, భూముల క్రయ విక్రయాలు తగ్గిపోయి రిజిస్ట్రేషన్ రెవెన్యూ పడిపోయిందని, అయితే ఎక్సయిజ్ శాఖ మాత్రం ఆదుకుంటున్నదని ఆయన తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభుత్వానికి కలిసి వస్తున్నదని పెట్రో ఉత్పత్తులపై రాష్ర్టం కూడా భారీగా పన్ను విధించడతో రేటు పెరిగిన దామాషాలో ఆదాయం పెరుగుతున్నదని ఆయన ఆనందంగా తెలిపాడు. మధ్యతరగతి ప్రజలకు ఈ విధంగా మనం కష్టపెడుతున్నామని విజయ్ అనడంతో ఇద్దరూ నవ్వుకున్నారు.ఆఫీసు పనివేళలు ముగుస్తుండటంతో తాను కలవాల్సిన ఇతర అధికారులకు ఇబ్బందిఎందుకు పెట్టాలని విజయ్ తన క్వార్టర్‌కు తిరిగి వచ్చాడు.

అధికారులతో మాట్లాడుతున్నంత సేపు తన ఢిల్లీ పర్యటన విషయం తాత్కాలికంగా మరుగున పడినా…ఇంటికి రాగానే మళ్లీ అదే ప్రశ్న ముందుకు వచ్చింది. ప్రమాదం జరిగిన తేదీకి, తాను లాడ్జీకి వచ్చి ప్యాకప్ చేసుకొని ప్రభుత్వ భవన్‌కు వచ్చిన తేదీ మధ్య నాకు ఏమి జరిగిందనేది ఆయన మనస్సును వేధిస్తున్నది. ఎంత గుర్తుకు తెచ్చుకున్న ఆ మధ్య నాలుగైదు రోజులు ఎక్కడ గడిపాడో అంతుచిక్కడం లేదు. రోజు డైరీ రాసే అలవాటు లేకపోవడంతో మరింత ఈ విషయంలో మరింత అయోమయంలో పడ్డాడు. అయితే ఏమి జరిగినా నాకు మంచే జరిగింది. ప్రమాదంలో చనిపోయానో లేదో తెలియదు కానీ ఈ దాడిలో డ్రైవర్ నారాయణ మృతి చెందడం విజయ్‌కు బాగానే గుర్తు ఉంది. వీలైతే ఆయన కుటుంబ వివరాలు తెలుసుకోవాలని భావించినా… తానున్ను ప్రస్తుత పరిస్థితుల్లో… దీంతో ఏవైనా కొత్త చిక్కులు రావచ్చని మరిచిపోవడమే ఉత్తమమని భావించాడు.తన జీవితంలో ఏదో రహస్యం ఉన్నట్లు తోస్తున్నది కానీ ఈ విషయం ఎవరితోనూ సంప్రదించ రాదని మాత్రం విజయ్ నిర్ణయానికి వచ్చారు.

ఉదయం నుంచి తన పిఎ కనిపించకపోవడంతో ఒకసారి ఫోన్ చేశాడు. సార్ క్వార్టర్‌లో మీరు లేరని కిందనే ఎదురు చూస్తున్నాను. మీరువచ్చారా అంటూ అడగగా ఆ ఇంటిలోనే ఉన్నానని విజయ్ ఫోన్ పెట్టేశాడు.

ఏమిటయ్యా.. ఎప్పుడు బుజీగా ఉంటావు. ఏనాడు సమయానికి కనిపించవు. ఏమిటీ సంగతులంటూ పిఎను అడిగాడు విజయ్.
దానికి ఆయన నీళ్లు నములుతూ ఉండిపోయారు. పర్వాలేదు చెప్పమని మరోసారి అనడంతో తన కథ చెప్పమంటారా అంటూ సిగ్గుపడ్డారు విజయ్ పిఎ నగేష్.

పర్వాలేదు చెప్పు. మనకు విజిటర్స్ ఎవరూ లేరుగా తీరికగా ఉన్నాం కదా..

రూ.100 ల ప్రేమ కథ

పెళ్లి చేసుకున్నానని మీకు రెండేళ్ల కిందటే చెప్పాను కదా సార్. అప్పటి నుంచి నాకు కష్టాలు ప్రారంభమయ్యామి. పేరుకు మాది ప్రేమ వివాహమే కానీ ఆమె అంత సఖ్యతతో ఉండటం లేదు. ఆ విషయాలన్నీ మీకు బోర్‌కొడతాయి సర్. మాది వంద రూపాయల ప్రేమ కథ అంటూ నవ్వాడు.

అదేమిటి 100 రూపాయల ప్రేమ. ఆసక్తిగా ఉంది ఆ మాటతో ..అయినా లవ్ తర్వాత సమస్యలా.. ఏమిటీ..ప్రేమ వివాహాల్లోనే దంపతులు అన్యోన్యంగా ఉంటారిన నేననుకుంటున్నాను. అని పిఎ ముఖం చూసినా…తనకు విరంచి ఆ సమయంలో గుర్తుకు రావడంతో పిఎ లవ్ స్టోరీ తెలుసుకోవానే కుతూహలం పెరిగింది విజయ్‌లో.

మీకు బోర్ అనిపిస్తే చెప్పండి సార్ టక్కున ఆపేస్తాను. ఆసక్తిగా ఉందని అంటున్నారని చెబుతున్నా..ఇదేమి పెద్ద ఉపయోగం ఉన్న విషయం కాదు సార్ మీకు అంటూ నగేష్ తన కథ చెప్పడం ప్రారంభించారు.

నగేష్ డిగ్రీ పాస్ అయిన తర్వాత అందరిలాగానే పిజి కోర్సు చేద్దామని నిర్ణయించుకొని హైదరాబాద్‌కు వచ్చాడు. ఉస్మానియా యూనివర్సిటీలో పిజి చేయడానికి ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీని ఎంట్రన్స్ పరీక్షకు ఫీజు చెల్లంచాలని బ్యాంకుకు పోయాడు. అప్పటికే తనలాంటి విద్యార్థులు, కొందరు విద్యార్థినులు కూడా బ్యాంక్‌లో ఉన్నారు. ఛలానా ఫారం తీసుకొని దానిని నింపడానికి ప్రయత్నిస్తుండగా ఒక కాలంలో ఏమి రాయాలో తెలియలేదు. దీంతో పక్కనే తన లాగే ఫారం నింపుతున్న అమ్మాయి కనిపించడంతో ఆమె వద్దకు వెళ్లి ఫారం చూపి ఇక్కడ ఏమి రాయాలంటారు అని అడిగాడు. ఆమె చెప్పిన వివరాలు రాసీ ఇద్దరు క్యూలో నిలబడ్డారు. అమ్మాయి ముందు, నగేష్ వెనుక. ఈ లోగా ఇద్దరి మధ్య సంభాషణలు ప్రారంభమయ్యాయి. మీరు ఎక్కడ నుంచి వచ్చారంటే మీరు ఏ జిల్లా నుంచి అంటూ ఇరువురు ప్రశ్నించుకోవడంతో ఇద్దరిదీ మహబూబ్ నగర్ పట్టణమే కావడంతో ఏ స్కూల్‌లో చదివారు, డిగ్రీ ఎక్కడ అంటూ ముచ్చట్లు సాగాయి. ఇంతలో క్యూ తగ్గిపోయి అమ్మాయి కౌంటర్‌లో తన ఫారం,ఫీజు డబ్బులు అందించింది. లాస్టు డేట్ ఎప్పుడో అయిపోయింది. మీరు తక్కువ మొత్తం రాసినట్లున్నారు. మరో వంద రూపాలయలు ఇవ్వండి. ఇదే చివరి రోజని మీ ముందు ఛలాన్ తీసుకున్న విద్యార్థులు అనడం విన్నాను. అంటూ బ్యాంకు అకౌంటెంట్ చెప్పడంతో ఒక్కసారే గొంతలో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది ఆ అమ్మాయికి. ముందు మీరు చెల్లించండి అంటూ నగేష్‌కు అవకాశం ఇచ్చి పక్కకు నిలబడింది అమ్మాయి. ఈ హఠాత్తు పరిణామం ఏమిటో ఆయనకు అర్థం కాలేదు.

(సశేషం)

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-16)

11 Comments
  1. Facebook Marketing says

    Wow, awesome weblog structure! How lengthy have you been blogging for? you make blogging glance easy. The full glance of your web site is fantastic, let alone the content material!!

  2. Earn Online says

    Wow, incredible weblog structure! How lengthy have you ever been blogging for? you made blogging look easy. The entire look of your web site is excellent, as neatly as the content!!

  3. Hey! Quick question that’s completely off topic. Do you know how to make your site mobile friendly? My weblog looks weird when viewing from my iphone 4. I’m trying to find a template or plugin that might be able to fix this problem. If you have any recommendations, please share. With thanks!

  4. watchown.tv/activate says

    Oh my goodness! a tremendous article dude. Thank you Nonetheless I’m experiencing issue with ur rss . Dont know why Unable to subscribe to it. Is there anybody getting an identical rss problem? Anybody who knows kindly respond. Thnkx

  5. visit says

    Excellent beat ! I wish to apprentice while you amend your web site, how can i subscribe for a blog web site? The account helped me a acceptable deal. I had been a little bit acquainted of this your broadcast offered bright clear concept

  6. toloco massage gun reviews says

    Sweet blog! I found it while searching on Yahoo News. Do you have any suggestions on how to get listed in Yahoo News? I’ve been trying for a while but I never seem to get there! Many thanks

  7. Write more, thats all I have to say. Literally, it seems as though you relied on the video to make your point. You obviously know what youre talking about, why waste your intelligence on just posting videos to your weblog when you could be giving us something enlightening to read?

  8. jetbluemastercard com says

    Hi, i read your blog from time to time and i own a similar one and i was just wondering if you get a lot of spam remarks? If so how do you stop it, any plugin or anything you can advise? I get so much lately it’s driving me crazy so any assistance is very much appreciated.

  9. jetbluemastercard com says

    Today, I went to the beach front with my kids. I found a sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She placed the shell to her ear and screamed. There was a hermit crab inside and it pinched her ear. She never wants to go back! LoL I know this is totally off topic but I had to tell someone!

  10. Skywestonline login says

    Hiya! I know this is kinda off topic however I’d figured I’d ask. Would you be interested in trading links or maybe guest authoring a blog article or vice-versa? My blog addresses a lot of the same topics as yours and I believe we could greatly benefit from each other. If you’re interested feel free to shoot me an email. I look forward to hearing from you! Great blog by the way!

  11. bluebird.com says

    Write more, thats all I have to say. Literally, it seems as though you relied on the video to make your point. You obviously know what youre talking about, why waste your intelligence on just posting videos to your site when you could be giving us something informative to read?

Leave A Reply

Your email address will not be published.