Vikarabad: స‌ర్ప‌న్‌ప‌ల్లి ప్రాజెక్టులో ప‌డ‌వ బోల్తాప‌డి ఇద్ద‌రు మృతి

వికారాబాద్ (CLiC2NEWS): జిల్లాలోని స‌ర్ప‌న్‌ప‌ల్లి ప్రాజెక్టులో ప‌డ‌వ బోల్తాప‌డి ఇద్ద‌రు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రి పరిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు సమాచారం. హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన ఓ కుటుంబం స‌ర్ప‌న్ పల్లి ప్రాజెక్టు స‌మీపంలోని రిసార్ట్‌కు విహార యాత్ర‌కు వెళ్లారు. ఈ క్ర‌మంలో వారు ప్ర‌యాణిస్తున్న ప‌డ‌వ బోల్తాప‌డింది. దీంతో న‌లుగురు నీటిలో మునిగిపోయారు. వారిలో ఇద్ద‌రు పూన‌మ్‌, రితికి ప్రాణాలు కోల్పోగా.. మ‌రో ఇద్ద‌రు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ప‌రిస్తితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబం బిహార్ నుండి వ‌చ్చి హైద‌రాబాద్‌లోని మియాపుర్‌లో నివ‌సిస్తున్న‌ట్లు స‌మాచారం.

ప్రాజెక్టులో ప్ర‌భ‌త్వ అనుమ‌తులు లేకుండా బోట్లు న‌డుపుతున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో అనేక ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నా కానీ, అధికారులెవ‌రూ పట్టించుకోవ‌ట్లేద‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.