ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. విఆర్ ఓ సస్పెండ్
అమరావతి (CLiC2NEWS): ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగిని ఇసి సస్పెండ్ చేసింది. వైఎస్ ఆర్‌సిపి నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల దిమ్మిలి విఆర్ఓను ఇసి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారణ జరపగా.. విఆర్ ఓ రమేష్ రాజకీయ పార్టీ ప్రచారంలో పొల్గొన్నట్లు నిర్ధారణ జరిగింది. దీంతో విఆర్ ఓను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.