విరాట్ సెంచరీ.. సచిన్ రికార్డును సమం చేసిన కోహ్లీ..

కోల్‌కత్తా (CLiC2NEWS): ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన 49 సెంచరీ పూర్తి చేశాడు. దీంతో అంతర్జాతీయ కెరీర్‌లో సచిన్ వన్డే సెంచరీ రికార్డును సమం చేశాడు. కోహ్లీ తన 35వ పుట్టిన రోజు సందర్బంగా అభిమానులకు గిప్టుగా రికార్డును సాధించాడు. దీంతో అభిమానులందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక వరల్డ్‌కప్ విషయానికి వస్తే.. టీమ్ ఇండియా ముందుగా బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా ఎదట 327 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
వన్డేల్లో అత్యథిక శతకాలు చేసిన వారు
విరాట్ కోహ్లీ———— 49
సచిన్ టెండూల్కర్– 49
రోహిత్ శర్మ ———— 31
రికీ పాంటింగ్———- 30 (అస్ట్రేలియా)
సనత్ జయసూర్య —- 28 (శ్రీలంక)
హషీమ్ ఆమ్లా ———– 27 (సౌతాఫ్రికా)
ఎబి డివిలియర్స్ ——25 (సౌతాఫ్రికా)
క్రిస్ గేల్ ——————25 (వెస్టిండీస్)
కుమార్ సంగక్కర——-25 (శ్రీలంక)