Visakha: ఈ నెల 23న భార‌త్‌-ఆసీస్ టి20 మ్యాచ్‌..

టికెట్ల కోసం క్యూలైన్‌లో యువ‌త ప‌డుగాట్లు..

విశాఖ‌ (CLiC2): భార‌త్‌-అస్ట్రేలియా టి20 మ్యాచ్‌కు విశాఖ వేదిక‌కానుంది. ఈ నెల 23వ తేదీన న‌గ‌రంలోని ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో టి20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. దీనికోసం ఆన్‌లైన్ టికెట్ల విక్ర‌యం పూర్త‌వ్వ‌గా.. ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్ర‌యం మొద‌లైంది. మ‌ధుర‌వాడ‌లోని క్రికెట్ స్టేడియం, గాజువాక స్టేడియం, గాజువాక‌లోని ఇండోర్ స్టేడియంల‌లో ఈ టికెట్లును విక్ర‌యిస్తున్నారు.
దీంతో టికెట్ల కోసం రాత్రి నుండే యువ‌త స్టేడియం క్యూలైన్ల వ‌ద్ద‌ వేచి ఉండ‌టం గ‌మ‌నార్హం.. యువ‌తులు సైతం తెల్ల‌వారుజామునుండే టికెట్లు కోన‌గొటు చేయ‌డానికి క్యూలైన్ల వ‌ద్ద పోటీప‌డ్డారు. టికెట్ల ధ‌ర రూ. 600, 1,500 , 2,000, 3,000, 5,000గా ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.