విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు: రామ్మోహన్ నాయుడు
అమరావతి (CLiC2NEWS): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టిపరిస్థితిల్లోనూ ప్రైవేటీకరణ కాబోదని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి కేంద్ర బడ్జెట్ ఎపికి న్యాయం జరిగేలా ఉంటుందని, రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలలు ఉన్న క్రమంలో ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరతామన్నారు. కేంద్ర నిధులు గత ప్రభుత్వంలో పక్క దారి పట్టాయని, కేంద్ర పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో కేంద్ర పథకాలు ఆగాయని తెలిపారు.