నవంబర్ 15 నుండి విశాఖ విమానాశ్రయం రాత్రిపూట మూసివేత..
విశాఖ (CLiC2NEWS): ఈ నెల 15వ తేదీ నుండి విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను రాత్రిపూట మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రన్‌వే పునరుద్ధరణ పనుల కోసం రాత్రి 9 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు మూసివేయనున్నట్లు సమాచారం. పునరుద్ధరణ పనులు పూర్తి చేసేందుకు 4 నుండి 6 నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే పగటి పూట విమాన సర్వీసులు పెంచాలని నిర్ణయించారు.