‘మా’ అధ్యక్షుడిగా విష్ణు.. పెన్షన్ ఫైల్‌పై తొలి సంతకం!

హైదరాబాద్‌ (CLiC2NEWS): టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పెన్షన్‌ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. నరేష్ నుంచి నూతన బాధ్యతలు తీసుకున్న మంచు విష్ణు నేటి నుంచి మా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.

కాగా ఈసారి జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌పై హోరాహోరీగా పోరాడిన విష్ణు భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి.. ‘మా’ సభ్యుల పింఛన్‌ ఫైల్‌పై తొలి సంతకం చేశారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్‌లో కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ‘మీ సమస్యలు నాకు తెలియజేయండి. మీ మద్ధతు నాకు కావాలి’ అంటూ మంచు విష్ణు ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి విజయం సాధించిన 11 మంది సభ్యులు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.