ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ ప్రమాణస్వీకారం..

రాయ్‌పుర్ (CLiC2NEWS): ఛత్తీస్‌గఢ్ నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శర్మ ప్రమాణం చేయించారు. తెలంగాణతో పాటు దేశంలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గడ్‌లో జరిగిన ఎన్నికలలో బిజెపి పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుని నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిఎం ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, మంత్రులు నితిన్‌గడ్కరి, అమిత్‌షా కూడా హాజరయ్యారు.