‘విశ్వంభర’: స్పెషల్ వీడియో విడుదల చేసిన మెగాస్టార్
‘Vishvambhara’ Movie: వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ లో కథానాయికగా త్రిష నటిస్తోంది. కునాల్ కపూర్ ముఖ్య పాత్రం పోషించారు. ఈ చిత్రం ఆలస్యానికి కారణాన్ని వివరిస్తూ చిరంజీవి తాజాగా స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే తేదీపై అప్డేట్ ఇచ్చారు.
విశ్వంభర చిత్రం ఎందుకు ఆలస్యమవుతుందని చాలామందికి అనుమానం ఉందని.. ఆ జాప్యం సముచితమేనని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం లోని సెకండ్ హాఫ్ అంతా విఎఫ్ ఎక్స్ మీద ఆదారపడిందని, దీన్ని అత్యుత్తమంగా అందించాలనే ప్రయత్నంలో జాప్యం జరుగుతుందని తెలిపారు. ఈ సినిమా చందమామ కథలా సాగుతుందని, చిన్నా పెద్దా తేడా లేకుండా అందర్నీ అలరిస్తుందని తెలిపారు. దీని గ్లింప్స్ ఆగస్టు 21 సాయంత్రం 6.06 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని సమ్మర్లో ఎంజాయ్ చేయండి అని చిరంజీవి వీడియోలో తెలిపారు.
[…] Cinema News: ‘విశ్వంభర’: స్పెషల్ వీడియో విడుదల… […]
[…] Cinema News: ‘విశ్వంభర’: స్పెషల్ వీడియో విడుదల… […]