లేడీ గెటప్‌లో ప్రేక్షకులను అలరించనున్న విశ్వక్సేన్
హైదరాబాద్ (CLiC2NEWS): రామ్‌నారాయణ్ దర్వకత్వంలో రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ లైలా చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ లేడీ గెటప్‌లో కనిపించనున్నారు. ఆకాంక్ష కథానాయిక. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుండి గురువారం లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. లైలా చిత్రంలో విశ్వక్ అబ్బాయి, అమ్మాయి రెండు కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నారు. జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.
తన కెరీర్లో ఇంత ఫన్ రైడ్ మూవీ చేయలేదని, ఇలాంటి జానర్లో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని విశ్వక్ ఈ సందర్బంగా తెలిపారు. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని అన్నారు. లేడీ గెటప్‌లో ఉండగా తన తండ్రే..తనను గుర్తు పట్టలేదని ఈ సందర్బంగా తెలిపారు.