సిబిఐ విచార‌ణకు వివేకా అల్లుడు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలుగు రాష్ర్టాల్లో సంచ‌ల‌నం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచార‌ణ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. కాగా ఈ కేసులో ఆయ‌న అల్లుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారించారు. సెక్ష‌న్ సి ఆర్ పిసి 160 కింద ఇంత‌కు ముందే ఆయ‌న‌కు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న్ను హైద‌రాబాద్‌లోని సిబిఐ కార్యాల‌యానికి పిలిపించుకొని విచారించింది.

కాగా వివేకా హ‌త్యాస్థ‌లంలో దొరికిన లేఖ‌పై రాజ‌శేఖ‌ర రెడ్డిని అధికారులు ప్ర‌శ్నించిన‌ట్లు తెలుస్తోంది. సాయంత్రం నాలుగు గంట‌ల‌కు సిబిఐ కార్యాల‌యానికి వ‌చ్చిన రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. విచార‌ణ ముగిసిన త‌ర్వాత ఇంటికి వెళ్లిపోయారు.

ఈమ‌ధ్య కాలంలో ఈకేసులో అరెస్ట‌యిన వైఎస్ భాస్క‌ర్ రెడ్డి, ఉద‌య్ కుమార్ రెడ్డిల‌తో పాటు క‌డ‌ప‌పార్ల‌మెంటు స‌భ్యులు అవినాష్‌రెడ్డిని కూడా సిబిఐ అధికారులు విచారిస్తున్న క్ర‌మంలో వివేకా అల్లుడు రాజ‌శేఖ‌ర‌రెడ్డి ని విచార‌ణ‌కు పిల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకొంది.

Leave A Reply

Your email address will not be published.