వొడాఫోన్ సూపర్ హీరో ప్లాన్..
Vi Super Hero plan: ఆర్దరాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత అపరమిత డేటా. వొడాఫోన్ ఐడియా () తమ ప్రీపెయిడ్ యూజర్ల కోసం సూపర్ హీరో .. సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అపరిమిత డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇపుడు అదనంగా మరో ఆరు గంటలపాటు ఈ అపరమిత ప్లాన్ ను అందించనుంది. రోజువారి 2 జిబి లేదా అంత కంటే ఎక్కువ మొత్తం డేటా కలిగిన ప్లాన్ తో రీఛార్జి చేసుకున్న వారికి సూపర్ హీరో ప్లాన్ ప్రయోజనాలను పొందవచ్చు.
రూ.365 పైబడి రీఛార్జి చేసుకున్న వారికి సూపర్ ప్లాన్ ఆఫర్ వర్తిస్తుంది. అర్ధరాత్రి నుండి మధ్యాహ్నం వరకు సగం రోజు ఉచిత డేటాను ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా వారంలో మిగిలిన డేటాను వారంతానికి డేటా రోల్ ఓవర్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తుంది. నెలలో రెండు సార్లు డేటా అవసమైనపుడు 2జిబి అదనపు డేటాను ఎలాంటి రీఛార్జి అవసరం లేకుండానే పొందవచ్చు. యాప్ ద్వారా గానీ, 121249కి డయల్ చేసి పొందవచ్చు.