పింఛను డబ్బులతో వాలంటీర్ పరారీ

పల్నాడు (CLiC2NEWS): జిల్లాలలోని బొల్లాపల్లి మండలం మూగబింతలపాలెంలో ఓ వాలంటీర్ పింఛను డబ్బులు తీసుకొని పరారయ్యాడు. గ్రామ సచివాలయ సిబ్బంది ఈ విషయాన్ని వాలంటీర్ తండ్రి దృష్టికి తీసుకెళ్లారు. కుమారుడ చేసిన పనికి ఆతండ్రి పింఛను దారులు ఇబ్బంది పడకూడదని తన కుమారుడు తీసుకెళ్లిన మొత్తాన్ని సచివాలయ సిబ్బందికి అందించాడు. అడబ్బును సిబ్బంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గతంలోనూ వాలంటీర్ పింఛన్లు సరిగా పంపిణీ చేయలేదనే ఆరోపణలున్నట్లు స్థానికులు చెబుతున్నారు.