‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాన్ని బహిష్కరించిన వాలంటీర్లు..
![](https://clic2news.com/wp-content/uploads/2023/12/ap-sports-adudam-andhra.jpg)
గుంటూరు (CLiC2NEWS): జిల్లాలోని నల్లపాడులో నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్రా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కార్పొరేటర్లు బహిష్కరించారు. ముఖ్యమంత్రి జగన్ లయోలా పబ్లిక్ స్కూల్ వద్ద ఆడుదాం ఆంధ్ర పేరిట క్రీడా పోటీలు లాంఛనంగా ప్రారంభించాల్సి ఉంది. దీంతో అక్కడకు వచ్చిన కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి అనుమతి లేదంటూ వారిని నిరాకరించడంతో కార్పొరేటర్లు అక్కడినుండి వెనుదిరిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. చుట్టుగుంట కూడలి వద్ద ఆడుదాం ఆంద్రాకు బుదలుగా అడుగుదాం ఆంధ్రా అంటూ ధర్నాకు దిగారు. ప్రభుత్వ స్టేడియాలను నిర్వీర్యం చేసి, ప్రైవేటు విద్యా సంస్థలో ఆటలేంటని.. అడుదాం సరే.. ఆటస్ఠలాలలు ఎక్కడంటూ నినాదాలు చేశారు.
ఎపి రాష్ట్ర వ్యాప్తంగా మంగళవరం నుండి ఆడుదాం ఆంధ్రా పేరిట క్రీడా పోటీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపు నిచ్చింది. ఈ రోజు నుండి ఫిబ్రవరి 10 వరకు మొత్తం 47 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. క్రికెట్, వాలీబాల్, కబడ్డి, ఖొఖొ, బాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తారు.