ఆరు వేల మంది విద్యార్థుల‌తో ‘వాల్తేరు వీర‌య్య’ లుక్‌..

హైదరాబాద్ (CLiC2NEWS): మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడుగా ద‌ర్శ‌కుడు బాబి నిర్మిస్తున్న చిత్రం వాల్తేరు వీర‌య్య‌. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సిన‌మా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైన విష‌యం తెలిసిన‌దే. అయితే మ‌ల్లారెడ్డి యూనివ‌ర్సిటీ విద్యార్థులు వీర‌య్య లుక్‌ని రీ క్రియేట్ చేసి త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. యూనివ‌ర్సిటీ గ్రౌండ్‌లో చిరంజీవి లుక్‌ని డ్రా చేసి.. ఆ ఆకారంలో ఏకంగా ఆరు వేల‌మంది విద్యార్థులు కూర్చున్నారు. యూనివ‌ర్సిటీలో నిర్వ‌హించిన కాన్స‌ర్‌పై పోరాటం కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌ను స‌ర్‌ప్రైజ్ చేస్తూ రీ క్రియేట్ వీడియేను ప్లే చేయ‌గా.. చిరంజీవి వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. వాల్తేరు వీర‌య్య సినిమా సంక్రాంతికి విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.