‘వాల్తేరు వీరయ్య’ సినిమా ట్రైలర్..
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/waltairu-veeraiah-trailer.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ వాల్తేరు వీరయ్య ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటి వరకు విడుదలైన వేర్ ఈజ్ ద పార్టీ.. , పూనకాలు లోడింగ్ పాటలు శ్రోతలను అలరించాయి. ఇక ఈ రోజు విడుదలైన ట్రైలర్.. చిరంజీవి ఫ్యాన్స్‌కి నిజంగానే పూనకాలు వచ్చేలా ఉంది. ఈ చిత్రంలో మాస్ మాహారాజు రవితేజ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసినదే. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.