నిట్ వరంగల్‌లో 4 ఖాళీల భర్తీ..
వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (నిట్) ఒప్పంద ప్రాతిపదికన 4 ఖాళీలు భర్తీ చేయనున్నారు. విజిటింగ్ కన్సల్టెంట్ (లీగల్ అడ్వైజర్), ఫైర్ సేఫ్టి ఆఫీసర్, విజిటింగ్ కన్సల్టెంట్ (ఆర్కిటెక్ట్), ట్రెయినింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులను కోరుతుంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బిఇ/ బిటెక్, బిఆర్క్ , పిజి , అడ్వకేట్ తో పాటు పని అనుభవం ఉండాలి.
రాత పరీక్ష , ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి విజిటింగ్ కన్సల్టెంట్ కు నెలకు రూ. 50 వేలు, ఫైర్ సేప్టీ ఆఫీసర్‌కు రు. 70 వేలు, విజిటింగ్ కన్సల్టెంట్‌కు ప్రతి విజిటింగ్‌కు రూ. 5000, ట్రెయినింగ్ అండ్ ప్లేస్ మెంట్ ఆఫీసర్కు రూ. 60వేలు జీతం చెల్లిస్తారు. దరఖాస్తులను సెప్టెంబర్ 26లోగా పంపించాల్సి ఉంది.