స్వగ్రామానికి బయలుదేరిన కుటుంబం.. కారు అదుపు తప్పి ముగ్గురు మృతి

వరంగల్ (CLiC2NEWS): సొంతూరికి వెళ్లేందుకు బయలు దేరిన ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి చెందిన ప్రవీణ్ హనుమకొండలో నివసిస్తున్నారు. వారంతపు సెలవుల్లో స్వగ్రామానికి వెళ్లేందుకు కారులో బయలుదేరారు. సంగెం మండలం తీగరాజుపల్లి వద్దకు రాగానే ప్రవీణ్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు వెనుతిరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో యూటర్న్ తీసుకుంటున్న వారి కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్నఎస్ఆర్ఎస్‌పి కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో ప్రవీణ్, అతని కుమారుడు, కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్యను స్థానికులు గమనించి రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారుతో పాటు గల్లంతైన మృతదేహాలను వెలికితీశారు. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం వరంగల్ ఆస్పత్రికి తరలించారు. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.