Warngal: దారుణం.. వ్య‌క్తిని కొట్టి చంపారు?

వ‌రంగ‌ల్ (CLiC2NEWS): జిల్లాలోని ధ‌ర్మ‌సాగ‌ర్ గ్రామంలో ఓ వ్య‌క్తిని దారుణంగా కొట్ట‌డంతో మ‌ర‌ణించాడు. ధ‌ర్మ‌సాగ‌ర్ గ్రామంలో సోమ‌వారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మృతుడిని ఎస్సీ కాల‌నీకి చెందిన‌ చింతా అశోక్‌(35)గా గుర్తించారు. రేష‌న్ షాపుకు వెళ్లేందుకు వ‌చ్చిన అశోక్‌ను షాపు స‌మీపంలో ఇద్ద‌రు వ్య‌క్తులు క‌ర్ర‌ల‌తో విచ‌క్ష‌ణా ర‌హితంగా కొట్టడంతో తీవ్ర ర‌క్త‌స్రావ‌మై అక్క‌డే చ‌నిపోయాడు. మృతుడికి భార్య‌, ముగ్గురు కొడుకులు, ఓ కుమార్తె ఉన్నారు. కాజీపేట ఏసీపీ ర‌వీంద‌ర్ కుమార్‌, ధర్మ‌సాగ‌ర్ ఇన్‌స్పెక్ట‌ర్ ర‌మేశ్ కుమార్‌ సిబ్బందితో సంఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.