ఉస్మాన్‌సాగర్ 8 గేట్లు, హిమాయత్‌సాగర్ 6 గేట్ల ద్వారా నీటి విడుదల

హైదరాబాద్ (CLiC2NEWS): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మరోసారి జంట జలాశయాలకు భారీగా వరదనీరు చేరుతోంది. ఇప్పటికే రెండు జలాశయాలు నిండుకుండల్లా ఉండటంతో ప్రాజెక్టులో చేరుతున్న నీటిని బయటకు వదులుతున్నారు.
ఉస్మాన్‌సాగర్(గండిపేట)
ఉస్మాన్‌సాగర్(గండిపేట) రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండటంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 8 గేట్లను 6 ఫీట్ల మేర ఎత్తి 4658 క్యూసెక్కులు నీటిని మూసిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్‌కు 4300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.
హిమాయత్‌సాగర్
హిమాయత్‌సాగర్ జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. ఇప్పటికే రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరువలో నీరు ఉండటంతో 6 గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి 3910 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం హిమాయత్‌సాగర్‌కు 3500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది
Hi there! Quick question that’s entirely off topic.
Do you know how to make your site mobile friendly? My blog looks weird
when viewing from my iphone4. I’m trying to find a theme or plugin that might be able to fix this
issue. If you have any suggestions, please share.
Incredible! This blog looks just like my old one!
It’s on a totally different topic but it has pretty much the same layout and design. Outstanding choice of colors!