Hyd: రేపు ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

హైద‌రాబాద్‌: హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద మారుతీ సుజికి షోరూం నుండి దుర్గా వైన్స్ వరకు గల 1600 ఎంఎం డయా ఎమ్ఎస్ మెయిన్ పైపులైన్ కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. కాబ‌ట్టి సోమ‌వారం ఉద‌యం 6 గంటల నుండి మంగ‌ళ‌వారం ఉద‌యం 6 గంటల వరకు 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

బాలాపూర్, మైసారం, బార్కాస్ రిజ‌ర్వాయ‌ర్, మేకలమండి, భోలక్ పూర్ రిజ‌ర్వాయ‌ర్, తార్నాక, లాలాపేట్, భౌద్ధ నగర్, మారెడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎమ్ఈఎస్, కంటోన్మెంట్, ప్రకాష్ నగర్, పాటిగడ్డ రిజ‌ర్వాయ‌ర్, హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ‌, గౌత‌మ్ న‌గ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌, వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతినగర్ రిజ‌ర్వాయ‌ర్, మ‌హింద్ర హిల్స్ రిజ‌ర్వాయ‌ర్, ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కాన‌గ‌ర్, బీరప్పగడ్డ రిజర్వాయర్, మీర్ పేట్, బడంగ్ పేట్, బోడుప్పల్ లోని కొన్ని ప్రాంతాలకు సోమ‌వారం నీటి స‌ర‌ఫ‌రా ఉండ‌దని జ‌ల‌మండ‌లి అధికారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.