కక్ష సాధింపులకు సమయం కాదు..
మనమందరం సమష్టిగా సర్కార్‌ను ముందుకు తీసుకెళ్లాలిః పవన్

అమరావతి (CLiC2NEWS): ఎన్నికల్లో తెలుగుదేశం + జనసేన + బిజెపి కూటమి కలిసి కట్టుగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందని తెలిపారు. మంగళవారం విజయవాడలో కూటమి శాసన సభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూటమి శాసన సభా పక్ష నేతగా చంద్రాబాబు పేరును ప్రతిపాదించిన అనంతరం పవన్ మాట్లాడారు…
ముందుగా కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. 164 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలను కూటమి దక్కించుకుందని తెలిపారు. ఇది అద్భుతమైన విజయం అన్నారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని పేర్కొన్నారు.
అలాగే కక్ష సాధింపులకు ఇది సమయం కాదని పవన్ పేర్కొన్నారు. వ్యక్తిగత దూషణలు పక్కనపెట్టి మనమంతా కలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని పేర్కొన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
నాలుదు దశాబ్దాల అనుభం, పెట్టుబడులను తీసుకువచ్చే సమర్థత, విదేశాల అధ్యక్షులను తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించే శక్తి ఉన్న చంద్రబాబు నాయుడి నాయకత్వం ఎపికి చాలా అవసరం అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అద్భుతమైన పాలన అందిచాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం పవన్‌ను చంద్రబాబు ఆలింగనం చేసుకుని ధన్యవాదాలు తెలిపారు.