హైదరాబాద్​లో పాత, కొత్త నగరం అనే తేడా లేకుండా అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి కెటిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): సిఎం కెసిఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి జ‌రుగుతోంద‌ని పుర‌పాల‌క శాఖ మంత్రి కెటిఆర్ స్ప‌ష్టం చేశారు. పాత‌, కొత్త న‌గ‌రం అనే తేడా లేకుండా హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని మంత్రి పేర్కొన్నారు. మ‌ల‌క్‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని పిల్లిగుడిసెలు బ‌స్తీలో నూత‌నంగా నిర్మించిన 288 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ల‌బ్దిదారులంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి జ‌ర‌గాల‌నే ఉద్దేశంతో ఆయా ప్ర‌తిపాద‌న‌ల‌తో స్థానిక ఎమ్మెల్యే బ‌లాల ఎన్నోసార్లు సీఎం కేసీఆర్‌ను క‌లిసి విన్న‌వించారు. జంగంమెట్‌, బండ్ల‌గూడ‌, ఫారూఖ్‌న‌గ‌ర్‌లో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వేగ‌వంతం చేసి పేద ప్ర‌జ‌ల‌కు అంద‌జేస్తామ‌న్నారు. ఈ చౌర‌స్తాలో ఒక వేళ ప్ర‌యివేటు బిల్డ‌ర్ ఇల్లు క‌ట్టి ఉంటే.. ఒక్కో ఇల్లు రూ. 50 నుంచి రూ. 60 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌రీదు చేసి ఉండేవి. కానీ సీఎం కేసీఆర్ నిరుపేద ప్ర‌జ‌లు ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌నే ఉద్దేశంతో ఉచితంగా ఇండ్లు క‌ట్టించి ఇస్తున్నారు. ఇది ఇల్లు కాదు.. పేద వాడి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక… స‌ర్వ‌హంగుల‌తో ఈ ఇండ్ల‌ను నిర్మించాం. 19 షాపుల‌ను ఏర్పాటు చేశాం అని కేటీఆర్ తెలిపారు.

చంచ‌ల్‌గూడ జైలును ఇక్క‌డి నుంచి త‌ర‌లించాల‌ని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఓవైసీ విజ్ఞ‌ప్తి చేశారు అని మంత్రి కెటిఆర్‌ తెలిపారు. 34 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న చంచ‌ల్‌గూడ జైలును త‌ర‌లించి.. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా ఇండ్లు కానీ, ఐటీ పార్కు కానీ, విద్యాసంస్థ‌లు కానీ ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నారు. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తామ‌ని చెప్పారు.

2 Comments
  1. UFABET says

    I like reading through an article that can make men and women think.
    Also, many thanks for permitting me to comment!

  2. Stahlwandpool says

    I’m not that much of a online reader to be honest but your blogs really nice, keep it up!
    I’ll go ahead and bookmark your website to come
    back down the road. Many thanks

Leave A Reply

Your email address will not be published.