నూరు శాతం అధికారంలోకి వస్తాం: కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): పార్టి, ప్రజల శాశ్వత విజయం కోసం పనిచేయాలని నేతలకు కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం కెసిఆర్ అధ్యక్షతన బిఆర్ ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బిఆర్ ఎస్ పార్టి అధినేత కెసిఆర్.. పార్టి ఆవిర్భావం నుండి మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్తానంపై మాట్లాడారు. ప్రజల కష్టాలు బిఆర్ ఎస్‌కు మాత్రమే తెలుసనని.. బిఆర్ ఎస్ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదని కెసిఆర్ అన్నారు. వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన తెలిపారు.
పార్టి నేతలతో ఉద్యమం, తెలంగాన అభివృద్ధి కోసం చేసిన కృషిని వివరించి, పార్టి రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరి అంశాలపై కెసిఆర్ చర్చించారు. ఏడాది పొడవునా పార్టి రజతోత్సవ కార్యక్రామలు నిర్వహించాలని.. ఏప్రిల్ 10న హైదరాబాద్‌లో బిఆర్ ఎస్ ప్రతినిధుల సభ రజతోత్సవ కార్యక్రమాల కోసం సబ్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఏప్రిల్ 10 నుండి 27 వరకు సభ్యత్వ నమోదు.. 27న భారీ బహిరంగ సభ ఉంటుందని కెసిఆర్ తెలిపారు. అక్టోబర్, నవంబర్ లో పార్టి అధ్యక్షత ఎన్నిక ఉంటుందన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అందరూ కష్టపడాలని పిలుపునిచ్చారు.