ఇడి సీజ్ చేసిన నోట్ల గుట్ట‌లు.. పేద‌ల‌కు పంచే యోచ‌న‌లో ప్ర‌ధాని!

ఢిల్లీ (CLiC2NEWS): దేశ వ్యాప్తంగా అవినీతి కేసుల్లో అనేక చోట్ల ఇడి న‌గ‌దును స్వాధీనం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ న‌గ‌దును పేద‌ల‌కు పంచిపెట్టాల‌ని యోచిస్తున్న‌ట్లు , దానికి సంబంధించి న్యాయ స‌ల‌హాల‌ను తీసుకుంటున్నామ‌ని ప్ర‌ధాని మోడీ వెల్ల‌డించారు. ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను కేంద్ర దుర్వినియోగం చేస్తుంద‌ని విపక్షాలు ఆరోపిస్తున్నాయ‌ని .. వాటికి స‌మాధానంగా ప్ర‌ధాని మోడీ.. కాంగ్రెస్ హ‌యాంలో ఇడ నిరుప‌యోగంగా ఉండిపోయింద‌ని అన్నారు. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాతే స‌మ‌ర్ధంగా ప‌నిచేస్తుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఇడి స్వాధీనం చేసుకుంటున్న నోట్ల గుట్ట‌లను పేద‌ల‌కు పంచే అవ‌కాశాల‌ను అన్వేషిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. దీనికి సంబంధింది ఏం చేయాలో స‌ల‌హా ఇవ్వాల‌ని న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను కోరిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.