ఎల్బీన‌గ‌ర్ నుండి హ‌య‌త్ న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రో రైలును విస్త‌రిస్తామ‌న్న మంత్రి కెటిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): రానున్న ఎన్నిక‌ల‌లో టిఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే వ‌స్తుంద‌ని.. అపుడు ఎల్బీన‌గ‌ర్ నుండి హ‌య‌త్ న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రో రైలును విస్త‌రిస్తామ‌ని తెలంగాణ పుర‌పాల‌క‌, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఎల్‌బిన‌గ‌ర్‌లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను రాష్ట్ర మంత్రులు కెటిఆర్‌, మ‌ల్లారెడ్డి , ఎమ్మెల‌యే సుధీర్ రెడ్డితో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. న‌గ‌రంలో రెండో ద‌శ మెట్రో నిర్మాణం నాగోల్ నుండి ఎల్‌బిన‌గ‌ర్ వ‌ర‌కు పూర్తి చేస్తామ‌ని అన్నారు.
పెరుగుతున్న ట్రాఫిక్‌ ర‌ద్దీ దృష్ట్యా ఎల్బీన‌గ‌ర్ నుండి హ‌య‌త్ న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రో రైలును పొడిగించాల‌ని విజ్ఞ‌ప్తులు వ‌స్తున్నాయ‌ని అయ‌న తెలిపారు. రానున్న ఎన్నిక‌ల్లో టిఆర్ ఎస్ ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని.. అపుడు మెట్రో నిర్మాణంను విస్తారిస్తామ‌ని కెటిఆర్ తెలిపారు.

2 Comments
  1. bodrum yat kiralama says

    We absolutely love your blog and find a lot of your post’s to be exactly what I’m looking
    for. Do you offer guest writers to write content available for
    you? I wouldn’t mind composing a post or elaborating on a number
    of the subjects you write in relation to here. Again, awesome site!

  2. User Login says

    Cool. I spent a long time looking for relevant content and found that your article gave me new ideas, which is very helpful for my research. I think my thesis can be completed more smoothly. Thank you.

Leave A Reply

Your email address will not be published.