మునుగోడు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేరుస్తాం.. మంత్రి కెటిఆర్‌

మునుగోడు (CLiC2NEWS): న‌ల్గొండ జిల్లా స‌ర్వ‌తోముఖాబివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని.. మునుగోడు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకుంటామ‌ని మంత్రి కెటిఆర్ స్ప‌ష్టం చేశారు. నేడు రాష్ట్ర మంత్రులు జ‌గ‌దీశ్ రెడ్డి, ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌తో క‌లిసి కెటిఆర్ మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై స‌మీక్ష నిర్వ‌హించారు. సమావేశానాంత‌రం మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేస్తామ‌ని అన్నారు. అక్క‌డ త్వర‌లో 100 ప‌డ‌ల‌క‌ల ఆసుప‌త్రి నిర్మిస్తామ‌ని, చౌటుప్ప‌ల్ మున్సి పాలిటికీ రూ. 50 కోట్లు, చుండూరు మున్సిపాటికికీ రూ. 50 కోట్లు మంజూరు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. చండూరును త్వ‌ర‌లో రెవెన్యూ డివిజ‌న్‌గా మారుస్తామ‌ని ప్ర‌క‌టించారు. అదేవిధంగా కొత్తగా 5 స‌బ్ స్టేష‌న్లు నిర్మించాల‌ని నిర్ణ‌యించారు. నారాయ‌ణ‌పురంలో గిరిజ‌న గురుక‌ల పాఠ‌శాల‌ను ఏర్పాటు చేయనున్న‌ట్లు తెలిపారు. న‌ల్గొండ జిల్లాలో పెండింగ్ ప‌నుల‌ను స‌త్వ‌ర‌మే పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.