రైతుల భూములకు ఎకరానికి రూ.30వేలు లీజు చెల్లిస్తాం: సిఎం జగన్
కొలిమిగుండ్ల (CLiC2NEWS): నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో రామ్కో సిమెంట్స్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. రైతులు ముందుకొస్తే ఎకరానికి రూ.30 వేలు లీజు చెల్లించుందుకు సిద్ధమని అన్ని అన్నారు. ప్రభుత్వమే భూములను లీజుకు తీసుకొని సౌర, పవన విద్యుత్ తయరీ సంస్థలకు ఇస్తుందని తెలిపారు. ఈ లీజు రేటు మూడేళ్లకొకసారి 5% పెంచుతామని తెలిపారు. ఒక లొకేషన్లో సుమారు 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగేలా భూములు సేకరించాలని అన్నారు. దీనికి అనుగుణంగా రైతులను ఒప్పించే బాధ్యత ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులదే అని అన్నారు. గ్రీన్కో ప్రాజెక్టులకు రైతులందరూ సహకరించాలని సిఎం విజ్ఞప్తి చేశారు.